Priyanka Gandhi: ఆరెస్సెస్ పట్ల మోదీకి గౌరవం లేదు: ప్రియాంక గాంధీ

  • సున్నిత అంశాలపై అందరి అభిప్రాయాలను తీసుకోవాలనేది మోహన్ భగవత్ అభిప్రాయం
  • ఆరెస్సెస్ విధానాలను మోదీ అనుసరించడం లేదు
  • జమ్మూకశ్మీర్ విషయంలో కూడా ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారు

ఆరెస్సెస్ అభిప్రాయాల పట్ల ప్రధాని మోదీకి గౌరవం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ... సున్నితమైన అంశాలపై అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనేది మోహన్ భగవత్ అభిప్రాయమని చెప్పారు. ఆరెస్సెస్ విధాలను మోదీ అనుసరించడం లేదని అన్నారు.

జమ్మూకశ్మీర్ విషయంలో కూడా మోదీ ఏకపక్ష నిర్ణయాలనే తీసుకున్నారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ అంశాన్ని బీజేపీ పెద్ద సమస్యగా భావించకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Priyanka Gandhi
Modi
Mohan Bhagawat
RSS
BJP
Congress
Reservations
Jammu And Kashmir
  • Loading...

More Telugu News