Karnataka: కర్ణాటకలో భారీ వరదలు.. రూ.195 కోట్లు సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి యడియూరప్ప!
- వర్షాలు, వరదలకు కర్ణాటక అతలాకుతలం
- ప్రాణాలు కోల్పోయిన 76 మంది ప్రజలు
- 22 జిల్లాల్లో లక్షల హెక్టార్ల పంట నీటమునక
కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 76 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుణుడి ప్రతాపంతో 22 జిల్లాల్లో 6.09 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈరోజు స్పందించారు.
వరద బాధితుల సహాయక చర్యల కోసం రూ.195 కోట్లు విడుదల చేసినట్లు యడియూరప్ప తెలిపారు. వరదల నియంత్రణ, పునరావాస కార్యక్రమాలు, బాధితులకు దుస్తులు, ఇతర నిత్యావసరాల పంపిణీ కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. ఈ మొత్తాన్ని ఖజానా నుంచి విడుదల చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు యడియూరప్ప ట్వీట్ చేశారు.