shivraj singh chouhan: కాపాడాల్సిన కెప్టెనే దూకేశాడు.. రాహుల్ గాంధీపై శివరాజ్ సెటైర్లు

  • కాంగ్రెస్ నావ మునిగిపోతోంది
  • అందరికంటే ముందు రాహులే దూకేశారు
  • చుట్టూ తిరిగి మళ్లీ మేడమ్‌కే పగ్గాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి శివరాజ్ సింగ్ చౌహాన్ సెటైర్లు వేశారు. సముద్రంలో ఉన్న నౌక మునిగిపోతుంటే దానిని రక్షించేందుకు దాని కెప్టెన్ ప్రయత్నిస్తాడని, కానీ రాహుల్ గాంధీ తీరు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అనే ఓడ మునిగిపోతుంటే దానిని కాపాడాల్సిన కెప్టెన్ (రాహుల్) అందరికంటే ముందే దూకేశారని అన్నారు. అటూఇటూ తిరిగి ఇప్పుడా పదవి మళ్లీ మేడమ్ (సోనియా) వద్దకే చేరిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే అహ్మద్ టోపీ మహ్మద్ నెత్తిన.. మహ్మద్ టోపీ అహ్మద్ నెత్తిన పెట్టినట్టు ఉందని శివరాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

shivraj singh chouhan
Congress
Rahul Gandhi
Sonia Gandhi
  • Loading...

More Telugu News