BJP: బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు!

  • నెహ్రూపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చౌహాన్ కు మద్దతు
  • దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవారు ఎవరైనా నేరస్థులే 
  • ఆర్టికల్ 370 రద్దును స్వాగతించలేని వాళ్లు ఎన్నటీకి దేశభక్తులు కాలేరు

సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ మరోమారు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. గతంలో మహాత్మా గాంధీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, ఈసారి, జవహర్ లాల్ నెహ్రూను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. నాడు జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370ను అమలు చేసిన నెహ్రూను క్రిమినల్ గా అభివర్ణిస్తూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆమె మద్దతుగా నిలిచారు. దేశాన్ని ముక్కలుగా చేయాలనుకునేవారు ఎవరైనా నేరస్థులేనని, ఆర్టికల్ 370, 35-ఏ రద్దును స్వాగతించలేని వాళ్లు ఎన్నటీకి దేశభక్తులు కాలేరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మోదీ, అమిత్ షా పై ఆమె ప్రశంసలు కురిపించారు.

BJP
Mp
Pragna singh
sivaraj singh chohan
  • Loading...

More Telugu News