Paramilitary: పారామిలిటరీ బలగాల పదవీ విరమణ వయోపరిమితి పెంపు

  • 60 ఏళ్లకు పెంచుతూ హోం శాఖ నిర్ణయం
  • ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ
  • తక్షణమే అమల్లోకి రానున్న ఈ ఉత్తర్వులు

పారామిలిటరీ బలగాల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పదవీ విరమణ వయో పరిమితి పెంపు నిర్ణయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్) కు వర్తిస్తుంది. కాగా, పారా మిలిటరీ బలగాల్లో పని చేస్తున్న సిబ్బందికి ఒకే రకమైన నిబంధనలు పాటించాలన్న ఢిల్లీ హైకోర్టు గతంలో చేసిన సూచనల మేరకు కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Paramilitary
Forces
Crpf
Bsf
Itbp
AR
  • Loading...

More Telugu News