Uttam Kumar Reddy: ఏదో అదృష్టం కొద్దీ నాలుగు సీట్లు వచ్చాయంతే: బీజేపీపై ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలు

  • తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడలేదని వ్యాఖ్యలు
  • రాష్ట్రానికి ఏం చేశారని పుంజుకుంటారని బీజేపీపై మండిపాటు
  • టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే సరైన ప్రత్యామ్నాయం అని వెల్లడి

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీపై ధ్వజమెత్తారు. ఏదో అదృష్టం బాగుండి తెలంగాణలో బీజేపీకి 4 సీట్లు వచ్చాయి తప్పితే, రాష్ట్రంలో టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని ఉద్ఘాటించారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడలేదని, తెలంగాణకు ఏంచేసిందని బీజేపీ పుంజుకుంటుందో చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలకు తెరలేపాయని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ పై ఉన్న కేసులను సీబీఐ ఎందుకు విచారించడంలేదో చెప్పాలని నిలదీశారు.

Uttam Kumar Reddy
Congress
Telangana
BJP
  • Loading...

More Telugu News