Andhra Pradesh: చంద్రబాబుని టీడీపీ వాళ్ల కన్నా మేమే ఎక్కువగా కాపాడుకుంటాం: వైసీపీ నేత జోగి రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

  • ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు ఉండాలి
  • ఆయన ఉంటేనే కదా, మేము గెలిచేది
  • నాలుగైదు టర్మ్స్ మేము గెలవాలి

ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ తిరిగిన సంఘటన గురించిన వేడి ఇంకా చల్లారలేదు. చంద్రబాబుకు భద్రత కరువైందని, ఆయన హత్యకు కుట్ర చేశారని..ఇలా టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, ఆ ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతుండటం కొనసాగుతూనే ఉంది.

తాజాగా, ‘టీవీ9’ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొన్నారు. చంద్రబాబు హత్యకు కుట్ర పన్నుతున్నారని, అందుకే, ఆయన నివాసం వద్ద డ్రోన్ తిరిగిందన్న వార్తలను ఆయన ఖండించారు.

‘చంద్రబాబునాయుడి గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ల కన్నా మేమే ఎక్కువగా కాపాడుకుంటాం. ఎందుకంటే, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు గారు ఉండాలి. ఆయన ఉంటేనే కదా, మేము గెలిచేది. రేపు అయినా, ఎల్లుండి అయినా, ఇంకోసారి అయినా.. నాలుగైదు టర్మ్స్ మేము గెలవాలంటే నారా చంద్రబాబునాయుడు గారు క్షేమంగా ఉండాలి. ఈరోజు వారికి 23 సీట్లు వచ్చాయి. రేపు పదమూడు రావొచ్చు. ఆ తర్వాత మూడు రావచ్చు. నారా చంద్రబాబునాయుడు గారు వంద సంవత్సరాల పాటు వర్థిల్లాలని మేము అయితే కోరుకుంటాం’ అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
jogi
  • Loading...

More Telugu News