Governor: అకస్మాత్తుగా వాంతులతో బాధపడిన తెలంగాణ గవర్నర్ నరసింహన్... ఆసుపత్రికి తరలింపు.. డిశ్చార్జ్

  • బీహార్ పర్యటనకు వెళ్లిన నరసింహన్
  • గయలో ఉండగా అస్వస్థత
  • సాధారణ అస్వస్థతే అని తేల్చిన మెడికల్ కాలేజి డాక్టర్లు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. బీహార్ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం వాంతులతో బాధపడ్డారు. ఉన్నట్టుండి వాంతులు కావడంతో ఆయనను వెంటనే గయలోని మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాసేపటికి కోలుకున్న నరసింహన్ తన అర్ధాంగి విమలతో కలిసి ఢిల్లీ పయనమయ్యారు.

Governor
Telangana
Narasimhan
Bihar
Gaya
  • Loading...

More Telugu News