Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం శాడిస్ట్ విధానాలను అవలంబిస్తోంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం మూడు టీఎంసీలు
  • నాలుగు టీఎంసీల వరకు ఎందుకు ఆపారు?
  • వరద ఉద్ధృతి పెరగగానే నీటిని దిగువకు ఎందుకు వదల్లేదు?

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం శాడిస్ట్ విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం మూడు టీఎంసీలు అయితే, నాలుగు టీఎంసీల వరకు ఎందుకు ఆపారు? వరద ఉద్ధృతి పెరగగానే దిగువకు నీటిని ఎందుకు వదల్లేదు? ఒక్కసారిగా వరద కిందకు వదిలితే ఇబ్బందులు వస్తాయని తెలియదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వృథాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన లేదని విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
Gorantla
Buchaiah chowdary
  • Loading...

More Telugu News