Chandranna Pelli Kanuka: 'చంద్రన్న పెళ్లి కానుక' పేరు మారింది

  • వైయస్సార్ పెళ్లి కానుకగా పేరు మార్పు
  • ఈరోజు ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం
  • ఇప్పటికే పలు పథకాల పేర్ల మార్పు

ఆంధ్రప్రదేశ్ లో మరో పథకం పేరు మారింది. టీడీపీ హయాంలో ప్రారంభించిన 'చంద్రన్న పెళ్లి కానుక' పథకం పేరును 'వైయస్సార్ పెళ్లి కానుక'గా మార్చారు. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్లను జగన్ ప్రభుత్వం మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం పేరును వైయస్సార్ అక్షయపాత్రగా, ఎన్టీఆర్ భరోసా పథకాన్ని వైయస్సార్ పింఛను కానుకగా మార్చారు.

Chandranna Pelli Kanuka
YSR Pelli Kanuka
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News