Jagan: అందుకే అమరావతిని ముంచేందుకు కుట్ర పన్నారు: వేదవ్యాస్

  • అమరావతిలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదు
  • ప్రకాశం బ్యారేజీలో నీటిని నిల్వ ఉంచి ముంచేందుకు కుట్ర పన్నారు
  • ఫ్లడ్ మేనేజ్ మెంట్ కూడా తెలియనివాళ్లు మంత్రులుగా ఉన్నారు

ఏపీ రాజధాని అమరావతిలో ఉండటం ముఖ్యమంత్రి జగన్ కు ఇష్టం లేదని... అందుకే భారీ కుట్రకు తెరతీశారని టీడీపీ నేత వేదవ్యాస్ ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీలో నీటిని నిల్వ ఉంచి, అమరావతిని ముంచేందుకు కుట్ర పన్నారని చెప్పారు. రాజధానిగా అమరావతి పనికిరాదనే అభిప్రాయాన్ని జనాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. వరద బాధితులను గాలికొదిలేసిన మంత్రులు... చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్ కూడా తెలియనివాళ్లు మంత్రులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

Jagan
Chandrababu
Veda Vyas
Amaravathi
Floods
  • Loading...

More Telugu News