Ayodhya: అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు, ఇతర సిబ్బందికి జీతాలు పెంచిన యూపీ ప్రభుత్వం
- రూ. 13 వేలకు పెరిగిన ప్రధాన అర్చకుడి జీతం
- రూ. 500 చొప్పున పెరిగిన ఇతర సిబ్బంది జీతాలు
- జీతాలు పెంచాలని గత నెలలో కోరిన సిబ్బంది
అయోధ్యలోని రామాలయం (రామ్ లల్లా) ప్రధాన అర్చకుడితో పాటు ఇతర ఎనిమిది మంది సిబ్బందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ జీతాలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ జీతం రూ. 13 వేలకు పెరిగింది. ఇతర సిబ్బంది జీతాలను రూ. 500 మేరకు పెంచారు. వీరి జీతాలు రూ. 7,500 నుంచి రూ. 10 వేల మధ్య ఉన్నాయి.
ఈ సందర్భంగా సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, తమ జీతాలు కొంత మేర పెరిగినప్పటికీ తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. జీతాలు పెంచాలని గత నెలలో తాము కోరామని... జీతాలను పెంచుతున్నట్టు తమకు ఐదు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు.