Absconding: అజ్ఞాతం నుంచి వీడియో విడుదల చేసిన బీహార్ ఎమ్మెల్యే

  • ఎమ్మెల్యే పురాతన ఇంటి నుంచి ఏకే-47, బాంబులు స్వాధీనం
  • అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు
  • అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యే

తన నివాసం నుంచి అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బీహార్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. మరో మూడు నాలుగు రోజుల్లో కోర్టులో లొంగిపోతానని అందులో పేర్కొన్నారు. తాను అరెస్ట్‌కు భయపడి పారిపోలేదని, అవసరం మీద తన స్నేహితుడిని కలిసేందుకే వెళ్లానని పేర్కొన్నారు. నాలుగు రోజుల్లోపే తాను లొంగిపోతానని వివరించారు.

అనంత్ సింగ్‌కు చెందిన పాత ఇంటి నుంచి  ఏకే-47 రైఫిల్‌తోపాటు 22 లైవ్ కాట్రిడ్జ్‌లు, రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పాట్నాలోని అనంత్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తన ఇంటి నుంచి ఏకే-47, ఇతర ఆయుధాలు దొరకడం కుట్రలో భాగమేనన్నారు. పోలీసులే ఆ పనిచేశారని ఆరోపించారు. గత 14 ఏళ్లుగా తాను ఆ ఇంటి ముఖం కూడా చూడలేదన్నారు. అటువంటిది అక్కడ ఏకే-47 రైఫిల్ దొరికిందని చెప్పడం కుట్రలో భాగమేనని, ఈ కుట్ర వెనక అదనపు ఎస్పీ లిపి సింగ్ ఉన్నారని అనంత్ సింగ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News