Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరోసారి కాజల్ ఐటెం పాట 
  • బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రణీత 
  • హిందీ చిత్రం రీమేక్ లో నాని

*  అప్పుడప్పుడు ఐటెం సాంగులలో కూడా మెరిసే కథానాయిక కాజల్ ఆగర్వాల్ తాజాగా మరో స్పెషల్ పాటకు ఓకే చెప్పిందట. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో ఐటెం పాట చేయడానికి కాజల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  
*  గతంలో పలు తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించిన కన్నడ భామ ప్రణీత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న 'భుజ్ - ద ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో ఆమె నాయికగా నటిస్తోంది. ఇందులో తాను అజయ్ కు భార్యగా సంప్రదాయ రీతిలో కనిపిస్తానని ప్రణీత చెప్పింది.
*  వైవిధ్యంతో కూడిన చిత్రాలలో నటించడానికి ఇష్టపడే హీరో నాని త్వరలో ఓ హిందీ చిత్రం తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. జాతీయ అవార్డు అందుకున్న 'అంధాధున్' చిత్రం రీమేక్ లో నాని నటిస్తాడట.

Kajal Agarwal
Allu Arjun
Pranitha
Nani
  • Loading...

More Telugu News