KCR: హమ్మయ్య.. కేసీఆర్ అవినీతిని బీజేపీ కూడా గుర్తించింది: విజయశాంతి

  • ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు
  • కేసీఆర్ రూ.40 వేల కోట్లు జేబులో వేసుకున్నారు
  • తెలంగాణలో జరుగుతున్న అక్రమాలపై కేంద్రం విచారణ జరపాలి

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బీజేపీ ఎట్టకేలకు గుర్తించిందని, కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ కూడా బలపరిచిందని అన్నారు.

ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ రూ.40 వేల కోట్లను తన జేబులో వేసుకున్నారని స్వయంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డానే ఆరోపించారని పేర్కొన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన నడ్డాపై కేసీఆర్ కేసులు పెడతారా? అని విజయశాంతి ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారోనని తెలంగాణ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. తెలంగాణలో జరిగే అక్రమాలపై విచారణ జరిపి నిజాలను బయట పెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని విజయశాంతి అన్నారు.

KCR
vijayashanti
Telangana
JP Nadda
BJP
Congress
  • Loading...

More Telugu News