Lata Mangeshkar: ప్రముఖ గాయని లతామంగేష్కర్ ని కలిసిన రాష్ట్రపతి

  • ముంబైలోని లతా మంగేష్కర్ నివాసానికి వెళ్లిన కోవింద్
  • దేశం గర్వించదగిన వ్యక్తి లతా మంగేష్కర్
  • ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ విషెస్ తెలిపా: కోవింద్

బాలీవుడ్ ప్రముఖ గాయని లతామంగేష్కర్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కలిశారు. ఈ విషయాన్ని రామ్ నాథ్ కోవింద్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ముంబైలోని లతా మంగేష్కర్ నివాసానికి వెళ్లి ఆమెను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తన విషెస్ తెలియజేశానని అన్నారు. దేశం గర్వించదగిన వ్యక్తి లతా మంగేష్కర్ అని, ఆమె తన మనోహరమై, శ్రావ్యమైన పాటలతో మన జీవితాలను మధురం చేశారని, ఆమె తన నిరాడంబరత, దయతో మనలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, రామ్ నాథ్ కోవింద్ తమ నివాసానికి రావడంపై లతా మంగేష్కర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.

Lata Mangeshkar
Mumbai
President Of India
Kovind
  • Error fetching data: Network response was not ok

More Telugu News