Jagan: జగన్ సర్... మేం కూడా మీతోనే: కోన వెంకట్

  • జగన్ గురించి భావోద్వేగభరిత ట్వీట్ చేసిన కోన
  • ఇప్పటి రాజకీయ నాయకులపై గౌరవం కలగడానికి కారణం మీరేనంటూ కితాబు
  • ఏపీ అభివృద్ధిపై ఆశలు కలుగుతున్నాయంటే అందుకు మీరే కారణం అంటూ వ్యాఖ్యలు

టాలీవుడ్ దర్శకరచయిత కోన వెంకట్ ఏపీ సీఎం జగన్ గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ సర్, అమెరికా పర్యటనలో మీరు డల్లాస్ వద్ద ఎంతో నిజాయతీతో కూడిన ప్రసంగం చేశారు. అది మాకెంతో నచ్చింది. నేను రాజకీయాల్లో భాగం కావడానికి కారణం మీరే. ఇప్పటితరం రాజకీయ నాయకులపై నాకు గౌరవభావం ఏర్పడడానికి కారణం మీరే. ఏపీ అభివృద్ధిపై ఆశలు కలుగుతున్నాయంటే అందుకు కూడా మీరే కారణం... మేం మీతోనే ఉంటాం సర్... అంటూ కోన వెంకట్ భావోద్వేగాలు ప్రదర్శించారు. అంతేకాదు, జగన్ అమెరికా పర్యటనలో ప్రసంగిస్తున్న ఫొటోను కూడా పోస్టు చేశారు.

Jagan
Kona Venkat
  • Loading...

More Telugu News