Telangana: కేసీఆర్ మార్గదర్శకత్వంలో పని చేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయి: జెన్ కో-ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు

  • ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసిన ప్రభాకర్ రావు
  • విద్యుత్ రంగంపై కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉంది
  • ‘తెలంగాణ’లో విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత కేసీఆర్ దే

జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మను తెలంగాణ సీఎం కేసీఆర్ సన్మానించారు. ప్రగతిభవన్ లో కేసీఆర్ ను వారు కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ, విద్యుత్ రంగంపై కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందని కొనియాడారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత కేసీఆర్ దే అని ప్రశంసించారు.

Telangana
cm
Kcr
Zenco-Transco
CMD
  • Loading...

More Telugu News