Rajnath Singh: పాక్ ఎత్తుగడలకు ఎలా బదులివ్వాలో ప్రధాని మోదీకి బాగా తెలుసు: రాజ్ నాథ్ సింగ్

  • హర్యానాలో రాజ్ నాథ్ సభ
  • ఉగ్రవాదాన్ని పోషించడం మానుకునే వరకు పాక్ తో చర్చలుండవన్న రక్షణ మంత్రి
  • భారత్ ను అస్థిరపరచాలన్నది పాక్ కుయుక్తి అంటూ వ్యాఖ్యలు

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై స్పందించారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్ ను అస్థిరపరచాలన్నది పాక్ కుయుక్తి అని, పాక్ ఎత్తుగడలకు ఎలా జవాబు ఇవ్వాలో ప్రధాని నరేంద్ర మోదీకి బాగా తెలుసని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్ నాథ్ ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉగ్రవాద సంస్థలను పోషించడం మానుకునే వరకు పాక్ తో చర్చలు ఉండవని, ఒకవేళ చర్చించినా అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే మాట్లాడతామని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా నుంచే విమర్శలు వచ్చాయని, పాక్ విషయంలో భయపడాల్సిందేమీ లేదని అన్నారు.

Rajnath Singh
Narendra Modi
Pakistan
Jammu And Kashmir
  • Loading...

More Telugu News