India: పాక్ నిరసనకారుల నుంచి త్రివర్ణ పతాకాలను లాగేసుకున్న భారత పాత్రికేయురాలు

  • ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా లండన్ లో ప్రదర్శన
  • దుష్ట స్వభావాన్ని బయటపెట్టుకున్న పాకిస్థానీలు
  • భారత త్రివర్ణ పతాకాన్ని కాళ్లతో తొక్కుతూ వికృతానందం

లండన్ లో భారత జాతీయ పతాకానికి జరుగుతున్న అవమానాన్ని ఓ మహిళా పాత్రికేయురాలు ఎంతో తెగువతో అడ్డుకున్నారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థానీలు ఉడికిపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లండన్ లోని భారత హైకమిషనర్ కార్యాలయం ఎదుట కొందరు పాకిస్థానీలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని కిందపడేసి కాళ్లతో తొక్కుతూ, తమ వికృత స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. భారత జాతీయ జెండా పట్ల వారు మరింత అవమానకర రీతిలో ప్రవర్తిస్తుండడం చూసిన పూనమ్ జోషి అనే ఏఎన్ఐ జర్నలిస్టు ఒక్కసారి దూసుకువెళ్లి నిరసనకారుల నుంచి భారత జాతీయ జెండాలను లాగేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

India
Flag
London
Pakistan
  • Error fetching data: Network response was not ok

More Telugu News