Telugudesam: ప్రజల కొంపముంచిన వ్యక్తి చంద్రబాబు: వైసీపీ నేత రవిచంద్రారెడ్డి

  • చంద్రబాబు తన హయాంలో ఒరగబెట్టిందేమీ లేదు
  • రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేదు
  • చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజాధనం వృథా చేశారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో ఏవో సాధించినట్టు ప్రచారం చేసుకోవడమే తప్ప ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేదని, చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. ఐదేళ్ల తన పాలనతో ప్రజల కొంపముంచిన వ్యక్తి చంద్రబాబు అని, ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తోందని, సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు.

Telugudesam
Chandrababu
YSRCP
Ravichandra reddy
  • Loading...

More Telugu News