Andhra Pradesh: ఏపీ బీజేపీ చీఫ్ కన్నాతో సాధినేని యామిని భేటీ.. బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం!

  • ఇటీవల కన్నాను కలుసుకున్న టీడీపీ నేత
  • బీజేపీిలో కీలక పదవి ఇవ్వొచ్చని ఊహాగానాలు
  • ఈ వార్తలపై స్పందించని యామిని, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని నేతలు వరుసగా వీడుతున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా ఈ జాబితాలో చేరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సాధినేని యామిని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. దీంతో ఆమె బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

బీజేపీలో యామినికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు బీజేపీ, అటు సాధినేని యామిని ఇంతవరకూ స్పందించలేదు. టీడీపీలో చేరిన సాధినేని యామినికి చంద్రబాబు, పార్టీ అధికార ప్రతినిధి హోదాను కట్టబెట్టిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
KANNA
BJP
YAMINI
Telugudesam
JOINING
  • Loading...

More Telugu News