Chandrababu: నందమూరి హరికృష్ణ సంవత్సరీకం... జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు

  • హరికృష్ణ సంవత్సరీకం కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు
  • అల్లుళ్లతో మాటామంతీ
  • హరికృష్ణ చిత్రపటానికి నివాళులు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో తన బావమరిది నందమూరి హరికృష్ణ సంవత్సరీకం కార్యక్రమానికి హాజరయ్యారు. గతేడాది హరికృష్ణ ఇదే సమయంలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన సంవత్సరీకం కాగా, చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరికృష్ణ నివాసంలో ఆయనకు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. హరికృష్ణ తనయులతో ఆత్మీయంగా మసలుకున్న చంద్రబాబు వారితో కుటుంబ పరమైన విషయాలు చర్చించినట్టు తెలిసింది. అంతకుముందు హరికృష్ణ చిత్రపటం వద్ద ఆయన నివాళులు అర్పించారు.

Chandrababu
Nandamuri Harikrishna
Jr NTR
Kalyan Ram
  • Loading...

More Telugu News