Andhra Pradesh: చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతోంది.. అందుకే డ్రోన్ తో రెక్కీ నిర్వహించారు!: బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు

  • వైసీపీ వెంటనే ఈ కుట్రలను ఆపాలి
  • లేదంటే జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా
  • బాబుకు కేంద్రం రక్షణ కల్పించాలి

తెలుగుదేశం నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అందుకే చంద్రబాబు ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీశారని విమర్శించారు. చంద్రబాబు ఇంటి దగ్గర స్వయంగా వైసీపీ మంత్రులు రెక్కీ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో ఈరోజు మీడియాతో బుద్ధా వెంకన్న మాట్లాడారు. చంద్రబాబుపై పన్నుతున్న కుట్రలను ఇప్పటికైనా వైసీపీ ఆపాలని సూచించారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించారు. చంద్రబాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని కోరారు.

Andhra Pradesh
YSRCP
CONSPIRACY
ASSASINATION
PLAN
BUDDA VENKANNA
SUICIDE
WARNING
Telugudesam
  • Loading...

More Telugu News