Gandhi Bhavan: గాంధీభవన్ లో కొందరు నాపై కుట్ర చేస్తున్నారు: విజయశాంతి

  • నేను పార్టీ మారుతున్నానన్న ప్రచారం గాంధీభవన్ లోనే ప్రారంభమైంది
  •  పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తా
  •  హడావుడి నిర్ణయాలు తీసుకోను

గాంధీభవన్ లో కొందరు తనపై కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీనటి విజయశాంతి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం కూడా గాంధీ భవన్ లోనే ప్రారంభమైందని అన్నారు. పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానని, హడావుడి నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు కూడా స్పష్టం చేశానని పేర్కొన్నారు.

Gandhi Bhavan
Artist
Vijayashanti
congress
  • Loading...

More Telugu News