france: శాండ్ విచ్ ను లేటుగా తీసుకొచ్చిన వెయిటర్.. తుపాకీతో కాల్చిచంపిన కస్టమర్!

  • ఫ్రాన్స్ లోని పారిస్ లో ఘటన
  • వెయిటర్ భుజంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
  • రక్తస్రావంతో తుదిశ్వాస విడిచిన ఉద్యోగి

ఇటీవలికాలంలో మనుషులు మరీ క్రూరంగా తయారైపోతున్నారు. తాజాగా తన శాండ్ విచ్  ను ఆలస్యంగా తెచ్చినందుకు ఓ వెయిటర్ ను కస్టమర్ తుపాకీతో కాల్చిచంపాడు. యూరప్ దేశమైన ఫ్రాన్స్ లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు పారిస్‌లోని నాయిసీలే గ్రాండ్‌ హోటల్‌లో ఓ వ్యక్తి వచ్చాడు. తనకు శాండ్ విచ్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆహారం తీసుకురావడంతో కొంత ఆలస్యమైంది.

దీంతో సహనం కోల్పోయిన సదరు కస్టమర్..‘శాండ్ విచ్ తీసుకురావడానికి ఇంత ఆలస్యం చేస్తావా?’ అంటూ సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. వెయిటర్ సర్దిచెబుతున్నా వినకుండా తుపాకీని బయటకు తీసి అతనిపై కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో భుజంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో కుప్పకూలిపోయిన వెయిటర్, తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తులు స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారనీ, వీరిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

france
shoot
customer shot waiter
sandwich
gun
killed
Police
  • Loading...

More Telugu News