Andhra Pradesh: వైసీపీ మంత్రులు ఫొటోలకు ఫోజులు ఇచ్చుకుంటున్నారు!: కేశినేని నాని ఆగ్రహం

  • కృష్ణా ముంపు ప్రాంతాల్లో టీడీపీ నేతల పర్యటన
  • సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శ
  • బాధితులను పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్

తెలుగుదేశం నేతలు కేశినేని నాని, గద్దె రామ్మోహన్ ఈరోజు కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ.. సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని వరద పరిస్థితిపై కనీసం సమీక్ష కూడా చేయలేదని దుయ్యబట్టారు.

వైసీపీ మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షించడం మానేసి ఫొటోలు దిగడానికే పరిమితమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కారణంగా నష్టపోయిన ప్రజలను అన్నిరకాలుగా ఆదుకోవాలని కేశినేని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
government
Kesineni Nani
Twitter
  • Loading...

More Telugu News