Hyderabad: హైదరాబాద్ మెట్రోలో నారా బ్రాహ్మణి, దేవాన్ష్!

  • జూబ్లీహిల్స్ నుంచి లక్డీకపూల్ వరకూ ప్రయాణం
  • ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బ్రాహ్మణి
  • మెట్రో రైల్ ఎక్కాలన్న ఆసక్తితో ప్రయాణం

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఈ ఉదయం తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు దేవాన్ష్ తో కలసి వచ్చిన ఆమె, లక్డీకాపూల్ వరకూ ప్రయాణించారు. లక్డీ కపూల్ లో వీరిద్దరూ దిగేసరికే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనంలో వెళ్లిపోయారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరిన బ్రాహ్మణి, మెట్రో రైల్ ఎక్కినట్టు సమాచారం.

Hyderabad
Metro
Nara Brahmani
Devansh
  • Loading...

More Telugu News