Andhra Pradesh: అనంతపురంలో దారుణం.. టీడీపీ నేత కారును తగులబెట్టిన దుండగులు!

  • ఏపీలోని చిలమత్తూరులో ఘటన
  • అర్ధరాత్రి దాటాక పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన అగంతకులు
  • రూ.3 లక్షల నష్టం వచ్చిందని టీడీపీ నేత ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ రోజు దారుణం చోటుచేసుకుంది జిల్లాలోని చిలమత్తూరు మండలం టీడీపీ సింగిల్ విండో డైరెక్టర్ వాల్మీకీ లక్ష్మీనారాయణప్పకు చెందిన కాల్విస్ వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. అర్ధరాత్రి దాటాక కొందరు దుండగులు నారాయణప్ప ఇంటి దగ్గర ఆపిన క్వాలిస్ వద్దకు చేరుకున్నారు. అనంతరం దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈ ఘటనలో వాహనం పూర్తిగా కాలిపోయింది. కాగా, ఈ ఘటనపై టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన వాహనాన్ని తగులబెట్టారని లక్ష్మీనారాయణప్ప తెలిపారు. ఈ ప్రమాదంతో రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన చిలమత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Anantapur District
Fire Accident
Telugudesam
leader
car burned
Police
  • Loading...

More Telugu News