Crime News: భీమవరంలో సీబీఐ తనిఖీలు...నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్న కేటుగాళ్లు

  • పలు శాఖల నుంచి రూ.370 కోట్లు కొట్టేసినట్టు అనుమానం
  • జిల్లా వ్యాప్తంగా ఉన్నరుణగ్రహీతల వివరాల సేకరణ
  • పశ్చిమ గోదావరిలో ఆక్వా పరిశ్రమ రుణాలు అధికం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పలు బ్యాంకు శాఖల్లో రెండు రోజులుగా సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడం కలకలాన్ని రేపుతోంది. బ్యాంకుల్లో నకిలీ పత్రాలు కుదువపెట్టి దాదాపు 370 కోట్ల రూపాయలు రుణంగా కొందరు తీసుకున్నట్లు సమాచారం. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఆక్వా పరిశ్రమ నడుస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురికి బ్యాంకులు రుణాలిస్తుంటాయి. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలను సమర్పించి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో భీమవరానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు చెబుతున్నారు. భారీగా రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తుండడంతో బ్యాంకు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అధికారుల సమాచారంతో  ఆయా బ్యాంకుల్లో సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భీమవరంతోపాటు జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న వారి రికార్డులను రెండు రోజులుగా పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News