KCR: యాదాద్రి కొండపై కేసీఆర్‌తో కోమటిరెడ్డి భేటీ

  • సాగు, తాగునీటి సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
  • మరింత లోతుగా చర్చించేందుకు ఇంటికి ఆహ్వానించిన కేసీఆర్
  • మరో మూడు రోజుల్లో మరోమారు భేటీ కానున్న నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. శనివారం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన కేసీఆర్‌తో కోమటిరెడ్డి కొండపైనే భేటీ అయ్యారు. ఆలేరు నియోజకవర్గ సాగు, తాగునీరు సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కాగా, ఈ సమస్యల గురించి మరింత లోతుగా చర్చించేందుకు కేసీఆర్ తనను ఇంటికి ఆహ్వానించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. మరో మూడు రోజుల్లో తామిద్దరం మరోమారు భేటీ అవుతామని ఆయన వివరించారు.

KCR
komatireddy rajagopalreddy
yadadri
Telangana
  • Loading...

More Telugu News