Girl Student: సెలవులకు ఇంటికొచ్చిన బాలికను తల్లిని చేసిన తాతయ్య!

  • జగిత్యాల పట్టణంలో ఘటన
  • సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక
  • నాలుగో నెల గర్భవతని తేల్చిన వైద్యులు
  • ఇంకా ఫిర్యాదు రాలేదంటున్న వైద్యులు

పదో తరగతి చదువుతున్న ఓ బాలిక సెలవులకని ఇంటికి వస్తే, వరుసకు తాతయ్య అయ్యే వృద్ధుడు, మాయమాటలు చెప్పి, లోబరచుకుని గర్భవతిని చేసిన ఘటన జగిత్యాలలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, జగిత్యాల పురాణిపేటకు చెందిన 15 సంవత్సరాల బాలిక, రెసిడెన్షియల్ కాలేజీలో టెన్త్ చదువుతూ, సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చింది. ఆ ఇంటి పక్కనే బాలిక కుటుంబానికి బంధువు అయిన ఓ వృద్ధుడు ఉంటున్నాడు. వంట చేయాలంటూ బాలికను ఇంటికి పిలిపించుకున్న అతను, ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు.

దీంతో భయపడిన ఆమె, ఎవరికీ విషయం చెప్పకుండానే హాస్టల్ కు వెళ్లిపోయింది. గత పదిహేను రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటంతో, పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, నాలుగు నెలల గర్భవతని వైద్యులు తేల్చారు. తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో ఆ కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సదరు వృద్ధుడు, అందరికన్నా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుస్తుండగా, ఇంకా బాలిక తరఫు నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.

Girl Student
Rape
Old Man
Jagityala
Police
  • Loading...

More Telugu News