Tamilnadu: 40 సంవత్సరాలు సేదదీరేందుకు అనంత పుష్కరిణిలోకి వెళ్లిపోయిన అత్తి వరదరాజ స్వామి!

- 48 రోజుల పాటు పూజలందుకున్న స్వామి
- తిరిగి జలావాసంలోకి అత్తి వరదరాజస్వామి
- తిరిగి బయటకు వచ్చేది 2059లోనే
తమిళనాడులోని కాంచీపురంలో, గత 48 రోజులుగా భక్తులకు దర్శనమిచ్చిన అత్తి వరదరాజ స్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. నిన్న రాత్రి స్వామివారు 40 ఏళ్లు సేదదీరేందుకు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న అనంత పుష్కరిణిలోకి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య, పుష్కరిణి చుట్టూ వేలాది మంది ప్రజలు చూస్తుండగా, స్వామివారి నిలువెత్తు ప్రతిమను కోనేటి మధ్యలో ఉన్న మండపం కిందకు చేర్చారు.
