Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బావ అనిల్‌కుమార్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

  • 2009 ఎన్నికల్లో ఓ పార్టీకి ఓటేయాలంటూ కరపత్రాల పంపిణీ
  • ఆ కేసులో ఏ1 నిందితుడిగా అనిల్
  • సోమవారం కోర్టులో హాజరు పరచాలని ఆదేశం

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓ పార్టీకి ఓటేయాలంటూ కరపత్రాలు పంచిన కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావ అనిల్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 28 మార్చి 2009లో ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతంలో ఓ పార్టీకి ఓటేయాలంటూ ఆయన కరపత్రాలు పంచినట్టు కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. కేసు విచారణ కోసం కోర్టుకు హాజరు కాకుండా తాత్సారం చేస్తుండడంతో ఖమ్మం రెండో అదనపు  ప్రథమశ్రేణి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనిల్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ సోమవారం కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.

Jagan
Andhra Pradesh
anilkumar
  • Loading...

More Telugu News