Anil Kumar Yadav: కృష్ణా నదిలో నీళ్లు చూసి చంద్రబాబు కడుపు మండిపోతోంది: మంత్రి అనిల్ కుమార్

  • ఓటమి తర్వాత తండ్రీకొడుకులకు మతిపోయిందన్న అనిల్
  • పోలవరం ప్రాజక్టును అనుకున్న సమయానికే పూర్తి చేస్తామంటూ ధీమా
  • టెండర్ల రద్దుతో ప్రాజక్టు వ్యయం పెరుగుతుందన్న సీఈవో అభిప్రాయాలపై స్పష్టత ఇస్తామని వెల్లడి

ఏపీ నీటిపారుదల, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో నీళ్లు చూసి చంద్రబాబు రగిలిపోతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, లోకేశ్ లకు మతిపోయిందని అన్నారు. తాజాగా, తాము పోలవరం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశామని, పోలవరం ప్రాజక్టును అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టెండర్ల రద్దుతో ప్రాజక్టు వ్యయం అంచనాలను మించిపోతుందని పోలవరం అథారిటీ చెబుతోందని, అథారిటీ సీఈవో పేర్కొన్న అభిప్రాయాలపై త్వరలోనే స్పష్టత ఇస్తామని మంత్రి అనిల్ కుమార్ వివరించారు.

Anil Kumar Yadav
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News