India: మరింతగా విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం.. ఈసీఎంవో వ్యవస్థను అమర్చిన ఎయిమ్స్ వైద్యులు!

  • ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ
  • స్వయంగా శ్వాస తీసుకోలేకపోతున్న నేత
  • ఆసుపత్రికి వచ్చిన కేంద్ర మంత్రి హర్షవర్థన్, కాంగ్రెస్ నేత సింఘ్వీ

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం ఆయన్ను లైఫ్ సపోర్ట్ వ్యవస్థపై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. జైట్లీకి  ఈసీఎంఓ(ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రాన్‌ ఆక్సిజనేషన్‌)ను అమర్చినట్లు వెల్లడించారు. తనంతట తానుగా శ్వాస తీసుకోవడం వీలుకాకపోవడంతో ఈ వ్యవస్థను అమర్చామని చెప్పారు.

సాధారణంగా కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు, శ్వాస తీసుకోలేకపోయినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్ మను సింఘ్వి ఎయిమ్స్‌కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఇప్పటికే జైట్లీని రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, తదితరులు పరామర్శించిన సంగతి తెలిసిందే.

India
BJP
Arun Jaitly
health
serious
New Delhi
AIIMS
  • Loading...

More Telugu News