Yadagigutta: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

  • అర్చకులు, అధికారులు ఘనస్వాగతం
  • బాలాలయంలో ప్రత్యేక పూజలు
  • అభివృద్ధి పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం అభివృద్ధి పనులు పరిశీలించారు.

తొలుత  రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులు, తర్వాత  పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలించారు. నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సూచనల మేరకు సీఎం  స్థల పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల స్థలం కావాల్సి ఉండడంతో అనువైన ప్రాంతం గురించి చర్చించే అవకాశముంది. సాయంత్రం కేసీఆర్‌ హైదరాబాద్‌ చేరుకుంటారు.

Yadagigutta
CM KCR
development activities
  • Loading...

More Telugu News