Andhra Pradesh: లోకేశ్ ‘పెద్దమనిషి’ అయ్యాక ఇంతపెద్ద వరదను చూసిఉండడు..కౌన్సెలింగ్ ఇప్పించండయ్యా!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • పప్పు, మాలోకం అని సోషల్ మీడియా కితకితలు పెడుతోంది
  • అది ఎందుకో ఈరోజు అర్థమయింది
  • లోకేశ్ ది మామూలు బ్రెయిన్ కాదు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు టీడీపీ నేత నారా లోకేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద ఓ పడవ ఇరుక్కోవడంపై లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు వెటకారంగా స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమయిందిగా. చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు మేం అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో ఆయనకు కుట్ర యాంగిల్‌ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

‘‘లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది’’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Twitter
YSRCP
Vijay Sai Reddy
Flood
Krishna river
  • Error fetching data: Network response was not ok

More Telugu News