Krishna Board: కృష్ణానది బోర్డుకు ఏపీపై ఫిర్యాదు చేసిన తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్

  • ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తరలిస్తోంది
  • లెక్కల్లో తక్కువగా చూపిస్తోంది
  • ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి

ఏపీ ప్రభుత్వంపై కృష్ణానది బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఫిర్యాదు చేశారు. కృష్ణానది నుంచి ఏపీ ఎక్కువ నీటిని తరలిస్తోందని... కానీ, దాన్ని తక్కువ చేసి చూపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడుకు జాయింట్ టీమ్ ను కూడా రానివ్వకుండా అడ్డుకుంటోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని... లేకపోతే బోర్డుకు విశ్వసనీయత ఉండదని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వంతో కలసికట్టుగా వ్యవహరిస్తామని ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే... మరోవైపు బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Krishna Board
Telangana
Andhra Pradesh
Engineer in Chief
  • Loading...

More Telugu News