Andhra Pradesh: ఏపీలో వరద బీభత్సం.. ఏరియల్ సర్వే నిర్వహించిన గవర్నర్ బిశ్వభూషణ్!

  • కాకినాడ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి వచ్చిన గవర్నర్
  • వరద పరిస్థితిని గవర్నర్ కు వివరించిన అధికారులు
  • సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హరిచందన్ ఈరోజు వచ్చారు. అయితే అక్కడి చుట్టుపక్కల వరద పరిస్థితిని జిల్లా అధికారులు గవర్నర్ కు వివరించారు. దీంతో హెలికాప్టర్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ ఏరియల్ సర్వే నిర్వహించారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి ఎంతమేరకు నీటి విడుదల జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందన్న అధికారులు, పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా 18 మండలాలు నీట మునిగాయని చెప్పారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న గవర్నర్ వరద బాధితులను వెంటనే ఆదుకోవాలనీ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. అనంతరం స్నాతకోత్సవ కార్యక్రమం కోసం వెళ్లిపోయారు.

Andhra Pradesh
governor
Biswabhushan harichandan
ariel survey
Flood
  • Loading...

More Telugu News