Visakhapatnam District: విశాఖలో టీడీపీ నేత పీలా గోవింద్ భవనాన్ని కూల్చి వేస్తున్న జీవీఎంసీ

  • డ్రైన్‌ను ఆక్రమించి కట్టారని జీవీఎంసీ అధికారుల ఆరోపణ
  • గతంలో పలుమార్లు నోటీసులు పంపామన్న అధికారులు
  • కొనసాగుతున్న కూల్చివేత కార్యక్రమం

నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారంటూ విశాఖపట్టణానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చెందిన భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. గోవింద్‌కు ద్వారకానగర్ మెయిన్‌ రోడ్డులో బహుళ అంతస్తుల భవనం ఒకటి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి మురికి కాలువను ఆక్రమించి దీనిని నిర్మించారని జీవీఎంసీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో స్పందన కోరుతూ గతంలో పలుమార్లు గోవింద్‌కు నోటీసులు పంపినప్పటికీ స్పందన రాలేదని చెబుతున్నారు. దీంతో ఈ ఉదయం రంగంలోకి దిగిన జీవీఎంసీ సిబ్బంది.. అధికారుల సమక్షంలో కూల్చివేత మొదలుపెట్టారు. ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. ప్రస్తుతం కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది.

Visakhapatnam District
peela govind
Telugudesam
gvmc
  • Loading...

More Telugu News