Jagan: వాషింగ్టన్ లో తొలిరోజు బిజీబిజీగా జగన్.. ఫొటోలు ఇవిగో!

  • వాషింగ్టన్ డీసీలో జగన్ కు ఘన స్వాగతం
  • ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరు
  • రాత్రి భారత రాయబారి విందుకు హాజరుకానున్న జగన్

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన తొలి రోజును బిజీబిజీగా గడిపారు. కుటుంబంతో కలసి అమెరికాకు వెళ్లిన జగన్ కు వాషింగ్టన్ డీసీలో ఘన స్వాగతం లభించింది. జగన్ కోసం భారీగా తరలివచ్చిన ఎన్నారై అభిమానులు... 'జై జగన్' నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో జగన్ బిజీగా గడిపారు.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు జగన్ హాజరయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి ఇండియా హౌస్ లో భారత రాయబారి ఇచ్చే విందుకు కుటుంబ సభ్యులతో కలసి హాజరవనున్నారు. తన పర్యటనలో భాగంగా వివిధ అంశాలపై వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు, దౌత్యాధికారులతో జగన్ చర్చించనున్నారు. 18, 19 తేదీల్లో వాషింగ్టన్ డీసీ... 21, 22 తేదీల్లో షికాగోలో జగన్ టూర్ కొనసాగనుంది. అనంతరం ఆయన భారత్ కు తిరిగి రానున్నారు.

Jagan
Washington DC
YSRCP
  • Loading...

More Telugu News