gurunanak: నేడు గురునానక్ జయంతి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- నేడు గురునానక్ 550వ జయంతి
- ఘట్‌కేసర్ నుంచి భారీ ర్యాలీ
- వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలన్న పోలీసులు
సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్‌జీ 550వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీని తలపెట్టారు. ఘట్‌కేసర్ నుంచి ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ ఎల్‌బీ నగర్ మీదుగా దిల్‌సుక్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్ జంక్షన్, రంగ్‌మహల్ జంక్షన్ తదితర ప్రాంతాల గుండా సాగుతూ గురుద్వారా సాహెబ్ బారం బాల సిఖ్ చావ్‌నీకి చేరుకోనుంది.
ఈ నేపథ్యంలో ర్యాలీ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. రాత్రి 9 గంటల వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.