Jagan: ప్రభుత్వం పంపిన డ్రోన్లు చంద్రబాబు ఇంటిపైనే పని చేస్తాయా?: కళా వెంకట్రావు

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఎందుకు చిత్రీకరించడం లేదు
  • వరద పోటెత్తుతుంటే జగన్ విదేశాలకు వెళ్లిపోయారు
  • వైసీపీ వరద రాజకీయాలు చేస్తోంది

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్లు చక్కర్లు కొట్టడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ అంశంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, వైసీపీ వరద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నీట మునిగిన పంటలు, వరద బాధితుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా? అని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాలను డ్రోన్లతో వైసీపీ ప్రభుత్వం ఎందుకు చిత్రీకరించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి వద్దే ప్రభుత్వ డ్రోన్లు పని చేస్తాయా? అని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద పోటెత్తుతుంటే ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించలేదని, ఏరియల్ సర్వే కూడా చేయలేదని... రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్లిపోయారని విమర్శించారు. వైసీపీ నేతలు రాజకీయాలను పక్కన పెట్టాలని, వరద సహాయక చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.

Jagan
Chandrababu
Kala Venkatrao
floods
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News