Rajnath Singh: అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తాం: రాజ్ నాథ్ హెచ్చరిక

  • తొలుత అణ్వాయుధాలను ప్రయోగించవద్దనేది ఇండియా సిద్ధాంతం
  • పరిస్థితులను బట్టి మా పాలసీ మారుతుంది
  • పోఖ్రాన్ లో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన రాజ్ నాథ్

పాకిస్థాన్ కు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ఉద్రిక్తతలను పెంచే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతమని... అయితే జరుగుతున్న పరిస్థితులను బట్టి తమ పాలసీ మారే అవకాశం ఉందని తెలిపారు. భారత్ ను న్యూక్లియర్ పవర్ చేయాలనేది తమ ప్రాధాన్యతాంశమని... ఇది భారత పౌరులంతా గర్వపడే విషయమని... ఇదే సమయంలో అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. పోఖ్రాన్ లో జరిగిన ఓ సైనిక కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్ లో రాజ్ నాథ్ నివాళి అర్పించారు. పోఖ్రాన్ లోనే భారత్ రెండు అణు పరీక్షలను (1974, 1998 సంవత్సరాల్లో) నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News