Andhra Pradesh: చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న వైసీపీ-టీడీపీ కార్యకర్తలు!

  • ఈరోజు చంద్రబాబు ఇంటివద్ద డ్రోన్ చక్కర్లు
  • భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు.. పోటీగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు
  • ఘటనాస్థలికి వెళ్లిన వర్ల రామయ్య, ఆలపాటి, డొక్కా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై ఈరోజు టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ కాగా, వరద పరిస్థితిపై అంచనా కోసం తామే విజువల్స్ తీయాల్సిందిగా ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకోగా, పోటీగా అక్కడకు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

తాము ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులమని వారు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ-వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ గొడవ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, వర్ల రామయ్య, ఆలపాటి రాజా, మద్దాల గిరి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది.

Andhra Pradesh
Chandrababu
Undavalli home
Telugudesam
YSRCP
fight
  • Loading...

More Telugu News