Congress: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌ బై

  • బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడి
  • ఇప్పుడు దేశం యావత్తు కమల దళం వైపు చూస్తోంది
  • మోదీ అందిస్తున్న సుస్థిర పాలనే కారణం

తెలంగాణలో మరో కాంగ్రెస్‌ నాయకుడు కమల దళంలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతం దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది. భవిష్యత్తులో తెలంగాణలోనూ బీజేపీ అధికారం సాధిస్తుంది. దేశంలో ప్రధాని నరేంద్రమోదీ సుస్థిర పాలన అందిస్తున్నారు. అటువంటి పాలన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే నేను కూడా పార్టీ మారాలని నిర్ణయించాను’ అంటూ చెప్పుకొచ్చారు.

కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే సభలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.పి.నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.

Congress
BJP
Bhadradri Kothagudem District
illendu
ex mla abbayya
  • Loading...

More Telugu News