EC: ఓటరు కార్డులను ఆధార్ తో అనుసంధానించండి: కేంద్రానికి ఈసీ లేఖ

  • ఆధార్ తో అనుసంధానం జరిగితే బోగస్ ఓటర్లకు అడ్డుకట్ట వేయొచ్చు
  • ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులను కలిగి ఉండటాన్ని తగ్గించవచ్చు
  • ప్రజాప్రాతినిధ్య చట్టం 1950కి కూడా కొన్ని మార్పులు చేయాలి

ఓటరు ఐడీ కార్డులను 12 అంకెల ఆధార్ నంబరుతో అనుసంధించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం జరిగితే... బోగస్ ఓటర్లకు అడ్డుకట్ట వేయవచ్చని, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉండటాన్ని తగ్గించవచ్చని తన లేఖలో సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950కి కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానించుకోవడం ఓటరు వ్యక్తిగత నిర్ణయమని గతంలో ఈసీ వ్యాఖ్యానించింది. అయితే, 2016లో ఏకే జోటి చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత  ఈసీ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఓటర్ల ఆధార్ వివరాలను తమ డేటా బేస్ కు లింక్ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జులై 2017లో సుప్రీంకోర్టును ఈసీ కోరింది. మరోవైపు, ఇప్పటివరకు 32 కోట్ల మంది తమ ఆధార్ ను ఓటరు ఐడీ కార్డులతో అనుసంధానం చేసుకున్నారు.

EC
Law Ministry
Voter ID Card
Aadhaar Number
  • Loading...

More Telugu News