Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వేలికి గాయం!

  • దుబాయ్ లో సైమా అవార్డులు
  • కార్యక్రమానికి వచ్చిన విజయ్
  • మిడిల్ ఫింగర్ కు కట్టు

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వేలికి గాయమైంది. ప్రస్తుతం క్రాంతి మాధ‌వ్, ఆనంద్ అన్నామలై ద‌ర్శ‌క‌త్వంలో రెండు సినిమాలు చేస్తున్న విజయ్, నిన్న దుబాయ్ లో జరిగిన 'సైమా' అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆయన వేలికి గాయం కనిపించడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ మధ్య 'డియ‌ర్ కామ్రేడ్' షూటింగ్ లో గాయపడ్డ విజయ్, మరోసారి గాయ‌ప‌డ్డాడా? అన్న చర్చ మొదలైంది. ఈ కార్యక్రమానికి స్టయిల్ గా బ్లాక్ ప్యాంట్, బ్లాక్ డిజైనర్ టీ షర్ట్, వైట్ కోట్ ధరించి ట్రెండీగా వచ్చిన విజయ్, మిడిల్ ఫింగర్ కు కట్టు కట్టుకుని కనిపించాడు. ఇంతకీ అతని వేలికి ఏమైందన్న విషయం మాత్రం తెలియరాలేదు. దీనిపై విజయ్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.

Vijay Devarakonda
Middle Finger
Dubai
Saimaa
  • Loading...

More Telugu News