rayapati: జగన్‌ పరిపాలన సూపర్: టీడీపీ నేత రాయపాటి

  • నవరత్నాలు పథకానికి నిధుల కొరత ఎక్కువగా ఉంది
  • కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు
  • ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే వెల్లడిస్తా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రశంసలు కురిపించారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. నవరత్నాలు పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని... రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త టెండర్లను పిలవడం వల్ల వ్యయం పెరుగుతుందని అన్నారు. తాను ఏ పార్టీలో చేరబోతున్నాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

ఈరోజు తిరుమల వెంకన్నను రాయపాటి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయపాటి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన జగన్ ను ప్రశంసించడం చర్చనీయాంశం అవుతోంది. 

rayapati
jagan
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News